ఇక తాజాగా ఈ మూవీలోని ఓ డ్యూయెట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. హృతిక్, కియారా మీద చిత్రీకరించే ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ కేసరియా సంగీత బృందాన్ని రంగంలోకి దించారు. వార్ 2లోని ఈ యుగళ గీతం కోసం ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య మళ్ళీ ఒకే చోటకు చేరారు. త్వరలోనే ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. వార్ 2లో హృతిక్, కియారా పాత్ర మధ్య ప్రేమను చూపించే అందమైన ట్రాక్‌గా ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఇక ఇదే వార్ 2 నుంచి వచ్చే మొదటి పాట అవుతుందన్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ యాక్షన్ ప్యాక్డ్ వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది.