నాయుడు పర్యటన ముగిసిన 24 గంటలలోపే, అమరావతిలో ముందుగా భూములు కేటాయించిన 45 కేంద్ర కార్యాలయాలు రాజధాని ప్రాంతానికి తిరిగి రావడం ప్రారంభించాయి. మొదట్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కేంద్ర పరిపాలనా కార్యాలయాలు 2019కి ముందే అమరావతికి రావాల్సి ఉండగా.. వైసీపీ విధ్వంసక పూర్వరంగంతో ఈ కార్యాలయాలు దూరంగా నిలిచాయి.
అమరావతిని పునర్నిర్మించడం ప్రారంభించారు. ఫలితంగా, 45 కేంద్ర కార్యాలయాలు రాజధాని ప్రాంతానికి తిరిగి రావడం గురించి అమరావతి సీఆర్డీఏకి తెలియజేశాయి. సీఆర్డీఏ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యాలయాలను ముందుగా కేటాయించిన భూముల్లోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది.