డెంగితోనే నా చెల్లెలు ప్రాణాలు కోల్పోయింది.. ఇదిగోండి ధ్రువీకరణ పత్రం!

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగీనే లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య వెల్లడించడం అత్యంత దారుణమని.. సమస్యను ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని టీకాంగ్ నేత భట్టి విక్రమార్క అన్నారు. డెంగీతోనే తన చెల్లెలు మరణించిందని, ఆమె మరణ ధ్రువపత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని.. అప్పుడైన కళ్లు తెరవాలని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణలో అనేక సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని భట్టి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దోపిడీలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని హెచ్చరించారు.
 

వెబ్దునియా పై చదవండి