పుష్పరాజ్ చనిపోయిన తర్వాత ఏమయ్యాడు? అసలు చనిపోయాడా? లేదా అంశంతో సీక్వెల్ ఆరంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. నల్లమల అడవుల్లో ఎర్రచందనం అక్రమరవాణాతో ప్రారంభమైన పుష్పరాజ్ కెరీర్ ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ సామ్రాజ్యం విదేశాలకు విస్తరిస్తుందనీ, ఇందులో పరాభాషా ప్రముఖ నటులు కూడా కన్పించనున్నారనీ అది వెండితెరపై చూస్తేనే థ్రిల్ కలుగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ తదితరులు నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.