ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే అమరావతిలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.
అలాగే, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ కె.హరిబాబుతో కూడా వారు ఫోనులో మాట్లాడి, ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీశారు. ఆయన కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు.
కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగాను, పైడికొండల మాణిక్యాల రావు దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రిగా ఉన్నారు.