తిరుపతి ఉప ఎన్నికలో వేసిన‌ట్లే బ‌ద్వేలులో దొంగ ఓట్లు

శనివారం, 30 అక్టోబరు 2021 (17:23 IST)
కడప జిల్లా బద్వేలు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నిక‌ల‌కు పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే, వైసీపీకి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నార‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆరోపించారు. తిరుప‌తి ఉప ఎన్నిక స‌మ‌యంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే బ‌ద్వేలులోనూ క‌న‌ప‌డుతున్నాయ‌ని చెప్పారు.
 
'బద్వేల్ లో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదు. వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసీపీకి పోలీసులు సహకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలి. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా?' అని ఆయ‌న ప్రశ్నించారు. 'నాడు తిరుపతి ఉప ఎన్నికలో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేలులో పునరావృతం చేస్తున్నారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటు. గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారు?' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు