కారు నెంబర్ లేదు... ఎమ్మెల్యే స్టిక్కరూ లేదు... ఎమ్మెల్యే అంటే నమ్మేయాలా?

బుధవారం, 19 డిశెంబరు 2018 (11:37 IST)
కొంతమంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ప్రవర్తన అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా తాము సెలబ్రిటీలం అని కాస్త అత్యుత్సాహంగా వుంటారు కొందరు. అదికాస్తా కొన్నిసార్లు వారిని ఇబ్బందులపాల్జేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే... దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును కాజా టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. 
 
దాంతో కారులో వున్న చింతమనేని తను ఎమ్మెల్యేననీ, కారుకు క్లియరెన్స్ ఇవ్వాలని అన్నారు. ఐతే సిబ్బంది మాత్రం వదల్లేదు. కారుకి నేమ్ ప్లేటు కూడా లేకపోవడంతో గట్టిగా మొండికేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారును కదలనిచ్చేది లేదన్నారు. తన గన్ మెన్లను చూపించి నేను ఎమ్మెల్యేనయ్యా అంటూ చింతమనేని అనడంతో అప్పుడు సిబ్బంది కాస్త మెత్తబడింది. 
 
ఐతే అప్పటికే ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే కారుని అక్కడే వదిలేసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో తప్పు టోల్ ప్లాజా సిబ్బందిది అంటే... మరికొందరు ఎమ్మెల్యేది అంటున్నారు. ఇంతకీ ఎవరదన్నది మీరైనా చెప్పేయండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు