నటి అపూర్వ తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన సంచలన కామెంట్లు చేశారు. ఆయన ఎమ్మెల్యే కావాలని తాము ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత తమకు నరకం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక్కసారి ఆయన కనుక ఎమ్మెల్యే అయితే దెందులూరులో వున్న తమ ఆస్తులన్నీ అమ్ముకుని తెలంగాణ రాష్ట్రానికి వలస రావాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన నాకు కులపిచ్చి లేదని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం వున్నవారికి ఓట్లు వేస్తామని వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలన వస్తే బాగుంటుందని దణ్ణం పెట్టుకున్నాననీ, కానీ ఇక్కడ చింతమనేని గెలిచి తమకు మాత్రం నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.