విశాఖపట్నంలో నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్ కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఈ కేంద్రం నుంచి దాదాపు 1000 మంది ఉద్యోగులు పని చేయనున్నారు. ఈ కార్యాలయాన్ని గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, ఆధునిక ఫలహారశాల, విస్తారమైన పార్కింగ్ సౌకర్యాలు వంటి అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంటుంది.
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు స్థాయిలో విశాఖ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రయోజనాలు ఉన్న ఏకైక నగరం ఇదేనని అన్నారు.