ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే పనులో బిజీగా ఉన్నారు. మంత్రివర్గ కూర్పుపై ఆయన ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తన మంత్రివర్గంలో అనుభవంతో పాటు యువతకు అవకాశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, మంత్రివర్గంలో తనతో కలుపుకుని మొత్తం 26గా ఉండేలా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు అన్నీ సక్రమంగా కుదినపక్షంలో ఈ నెల 8వ తేదీన జగన్ మంత్రులు ప్రమాణం చేసే అవకాశాలు లేకపోలేదు.
అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. అలాగే, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కో లోక్‌సభ స్థానం సరిహద్దుగా తీసుకుని మొత్తం 25 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున మంత్రి ప్రాతినిథ్యం వహించేలా జగన్ తన మంత్రివర్గంలో 26 మందికి చోటు కల్పించనున్నారు. సీఎం జగన్ దృష్టిలో మంత్రులుగా పరిశీలనలో ఉన్న పేర్లను పరిశీలిస్తే,
కడప జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), అంజాద్ బాషా (కడప).
కర్నూలు జిల్లా : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), శ్రీదేవి (పత్తికొండ), హఫీజ్ ఖాన్ (కర్నూలు).
అనంతపురం : అనంత వెంకటరామి రెడ్డి (అనంత అర్బన్), కాపు రామచంద్రా రెడ్డి (రాయదుర్గం), ఎం.శంకరనారాయణ (పెనుకొండ).
చిత్తూరు జిల్లా : పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు), భూమన కరుణాకర్ రెడ్డి (తిరుపతి).
నెల్లూరు జిల్లా : మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి), ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి).
ప్రకాశం జిల్లా : బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), ఆదిమూలపు సురేశ్ (యర్రగొండపాలెం).
గుంటూరు జిల్లా : మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి).
కృష్ణా జిల్లా : కొడాలి నాని (గుడివాడ), పేర్ని నాని (మచిలీపట్నం), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), కొలుసు పార్థసారథి (పెనమలూరు), మేకా వెంకట ప్రతాప అప్పారావు (నూజివీడు).
పశ్చిమ గోదావరి : ఆళ్ల నాని (ఏలూరు), తెల్లం బాలరాజు (పోలవరం), తానేటి వనిత (కొవ్వూరు), గ్రంథి శ్రీనివాస్ (భీమవరం).
తూర్పు గోదావరి : ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్), దాడిశెట్టి రాజా(తుని).