వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

ఐవీఆర్

బుధవారం, 25 జూన్ 2025 (22:59 IST)
ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, కమ్యూనిటీ, ప్లాట్‌ఫామ్ అయిన హెర్బాలైఫ్ ఇండియా, తన వృతిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి సంబంధించి భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ క్రీడా దిగ్గజాలు- భారత క్రికెటర్ స్మృతి మంధాన, భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మణికా బాత్రాతో తన భాగ స్వామ్యాన్ని విస్తరించినట్లు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం క్లినికల్‌గా పరీక్షించబడిన చర్మ సంరక్షణ దినచర్య ద్వారా ఆరోగ్యాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. శరీరం లోపలి నుండి శ్రేయస్సును ప్రోత్సహించడంలో హెర్బాలైఫ్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
 
అధిక స్థాయిలో శారీరక, పరిసరాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న అథ్లెట్లుగా, స్మృతి మంధాన, మణికా బాత్రా నాణ్యత లేదా ప్రామాణికతపై రాజీ పడకుండా తమ చురుకైన జీవనశైలికి మద్దతు ఇచ్చే అవగాహనతో కూడిన చర్మ సంరక్షణ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఈ భాగస్వామ్యం చర్మ సంరక్షణను ప్రోత్సహించడంలో ఉమ్మడి దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఇది ఆయుర్వేద సంప్రదాయాన్ని ఆధునిక శాస్త్రంతో మిళితం చేసి ప్రతి వ్యక్తి తమ స్వంత చర్మంపై నమ్మకంగా ఉండేలా చేస్తుంది.
 
హెర్బాలైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఖన్నా మాట్లాడుతూ, ‘‘ఆయుర్వేద సూత్రాలలో పాతుకు పోయిన, సైన్స్ మద్దతుతో పోషకాహారం, అవగాహనతో కూడిన చర్మ సంరక్షణ పట్ల మా నిరంతర నిబ ద్ధతను వృతిలైఫ్ ప్రతిబింబిస్తుంది. మేం ఈ శ్రేణిని విస్తరింపజేస్తూనే, హెర్బాలైఫ్‌కు ఇప్పటికే విలువైన ప్రచారకర్త లుగా ఉన్న స్మృతి మంధాన, మానికా బాత్రా వృతిలైఫ్ చర్మ సంరక్షణ శ్రేణిని సమర్థించడానికి తమ అనుబంధాన్ని విస్తరిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. వారు వృతిలైఫ్‌లో అంతర్భాగంగా ఉన్న సమతుల్యత, బలం, ప్రామాణికత స్ఫూర్తిని కలిగి ఉంటారు. వారి స్ఫూర్తిదాయక ప్రయాణాలు చర్మ సంరక్షణను సమగ్ర శ్రేయస్సు సాధికారత అంశంగా స్వీకరించడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడంలో మాకు సహాయపడతాయి’’ అని అన్నారు.
 
వృతిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణిలో ప్రస్తుతం ఫేషియల్ క్లెన్సర్, ఫేషియల్ టోనర్, ఫేషియల్ సీరం, మాయిశ్చరైజర్ ఉన్నాయి. ఈ చర్మ సంరక్షణ శ్రేణి వేప, పసుపు, కలబంద, కుంకుమది నూనె వంటి పదార్థాల వాడకానికి సంబంధించి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పదార్థాలు చర్మసంబంధంగా పరీక్షించబడిన, పారాబెన్-రహిత, సల్ఫేట్-రహిత, హైపోఅలెర్జెనిక్ యాక్టివ్‌లతో కలిపి ఉంటాయి. ప్రతి ఫార్ములేషన్ కూడా కఠినమైన క్లినికల్ ధ్రువీకరణ, హెర్బాలైఫ్ ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాల మద్దతుతో సామర్థ్యాన్ని అందించడానికి రూపొందించబడింది. బెంగళూరులోని హెర్బాలైఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అభివృద్ధి చేయబడిన ఈ ఉత్పత్తులు భారతదేశం కోసం భారతదేశంలో తయారుచేయబడ్డాయి. భారతీయ చర్మ రకాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించ బడ్డాయి.
 
భారత క్రికెటర్ స్మృతి మంధాన మాట్లాడుతూ, ‘‘వృతిలైఫ్ కుటుంబంలో వారి ప్రచారకర్తగా చేరడం నాకు సంతో షంగా ఉంది. ఒక అథ్లెట్‌గా, నిరంతరం ప్రయాణంలో ఉన్నప్పుడు నా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వృతిలైఫ్ ఆయుర్వేద ఆధారిత ఫార్ములేషన్లు నిజంగా నా జీవనశైలికి అనుగుణంగా ఉంటాయి. వెల్నెస్‌ను ప్రోత్సహించడాన్ని నేను నమ్ముతాను. వృతిలైఫ్ ఆ తత్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది’’ అని అన్నా రు.
 
భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మణికా బాత్రా మాట్లాడుతూ, ‘‘ఆటల్లో, జీవితంలో క్రమశిక్షణ, స్వీయ సంరక్షణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. వృతిలైఫ్ తో నేను చర్మ సంరక్షణను కనుగొన్నాను. ఇది సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయినప్పటికీ అదే సమయంలో ఇది చాలా ఆధునికమైనది కూడా. ఈ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం, ఈ దేశపు విభిన్న సౌందర్య సంప్రదాయాలను వేడుక చేసుకోవడం నాకు సంతో షంగా ఉంది’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు