టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు.
టీడీపీ నేతలు మర్యాదగా మాట్లాడితే మార్యాదగా మాట్లాడుతాం. నీ లాగా, మీ బాబులాగా మీ తాత పార్టీ లాక్కొని జగన్ సీఎం కాలేదు. దేశంలోనే రైతుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించిన నేత జగన్. లోకేష్ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలి. మీపార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు.
శాన్ ఫోర్డ్ వీరుడు, పప్పు వీరుడు. ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టో జగన్ క్యాబినేట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యాను. జగన్ పాదం వల్లే రెండేళ్లుగా డ్యామ్‌లు అన్నీ నిండుతున్నాయి. మీ తాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో (లోకేష్) ఓడిపోయావ్ అని లోకేష్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.