"బిగ్ బాస్" రియాల్టీ షో పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ ఓ సానెకొంప అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇపుడు మరోమారు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. సిగ్గూఎగ్గూ లేని జంతువులు ఏమైనా చేయగలవన్నారు. పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు, మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు అచ్చోసిన అంబోతుల్లా జీవించండని ఈ షో ద్వారా సందేశం ఇస్తారేమో అని ఆయన ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా, అన్నాచెల్లెళ్లు, కానోళ్లు, పిటపిటలాడే అందంతో ఉన్న ముక్కుముఖం తెలియని వాళ్లు, అచ్చోసిన ఆంబోతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజుల పాటు బూతుల స్వర్గంలో తమ విలువైన సమయాన్ని వృథా చేసే బిగ్ బాస్ షో వచ్చేస్తుందని ఆయన మండిపడ్డారు.