కుక్కను మింగేసిన మొసలి.. వైరల్ వీడియో..

బుధవారం, 20 మార్చి 2019 (18:31 IST)
నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండలం పార్పెళ్లి శివారులోని పంటపొలాల్లో మొసలి సంచరిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక బస్టాండ్ పక్కనే ఉన్న కన్నెమ్మ చెరువులో గుర్రపుడెక్క ఉన్న ప్రాంతంలోకి ఆహారం కోసం వెళ్లిన కుక్కను మొసలి మింగేసింది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది యువకులు తన సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. 
 
అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో చెరువు గట్టుపై గడ్డి మేస్తోన్న మేకలమందలోని ఓ మేకను కూడా మొసలి చెరువులోకి లాక్కెళ్లింది. అయితే మేకల కాపరి గట్టిగా కేకలు వేయడంతో మొసలి మేకను వదిలేసి నీటిలోకి వెళ్లింది. 
 
మొసలి చెరువు గట్టుపై తిరగడం వల్ల గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చెరువు గట్టుపై తిరిగేందుకు కూడా హడలెత్తిపోతున్నారు. మొసలి కుక్కను లాక్కెళ్లిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు