కూడికలు, తీసివేతలు చెప్పే మ్యాథ్స్ లెక్చరర్ ఒక్కసారిగా ప్రేమ పాఠాలు చెప్పాడు. సాధారణంగా మ్యాథ్స్‌లో కూడికలు, తీసివేతలు, ఫార్ములాలు ఉంటాయి. అయితే సదరు లెక్చరర్ మాత్రం వాటికి తన క్రియేటివిటీ కాస్త జోడించి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న వుమెన్స్ కాలేజ్‌లో చరణ్ సింగ్ అనే మ్యాథ్స్ లెక్చరర్ ప్రేమ ఫార్ములాలు బ్లాక్‌బోర్డుపై చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు.