దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని, ఇది ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై ఆ కేంద్ర అధికారి ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ, ఈ నెల పదో తేదీన వాయుగుండం తుఫానుగా మారనుండగా, దీనికి యెమెన్ దేశం మోచాగా నామకరణం చేసిందని తెలిపారు.
మరోవైపు విదేసీ వాతావరణ అధ్యయన సంస్థలు కూడా మోచా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ఈ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాకు పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.