రుషికొండ ప్యాలేస్, 58 గదులను 7 గదులు చేసారు, అవి జగన్ కోసమే.. మంత్రి మాటలు

సెల్వి

మంగళవారం, 19 నవంబరు 2024 (16:03 IST)
Durga Mallesh
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం రుషికొండ భవనాలపై శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరిగింది. రుషికొండ భవనాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే సభ్యుల మధ్య చర్చను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు. 
 
రుషికొండపై శాసనమండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని ఆరోపించారు. 
 
కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని... రుషికొండకు ఆపారమైన నష్టం కలిగిందని మండిపడ్డారు.  హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. ఇందుకోసం రూ.481 కోట్లు ఖర్చు పెట్టారు. 
 
కేటాయించబోయేమో రూ.451.67 కోట్లు. వాటితో పేదవాడికి 26 వేల మంది ఇళ్లు కట్టోచ్చని చెప్పారు. ఒక వ్యక్తి కోసం ఇంత డబ్బు ఖర్చు చేశారని మండిపడ్డారు. 
 
రుషికొండ వస్తానంటే, వైసీపీ నేతలను బస్సు వేసుకుని తీసుకువెళ్తామన్నారు. కాగా రుషికొండ అంశంపై అసెంబ్లీలో రగడ జరుగుతుండగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి వారి మాటలు గమనించారు. 

ఋషికొండ విషయం లో వైసీపీ దాచిన నిజాల్ని బయట పెట్టిన కందుల దుర్గేష్ గారు.

మొదట రిసార్ట్స్ కడతాము అని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకుని తరువాత ముఖ్యమంత్రి నివాసం అని జి.ఓ తెచ్చి అది బహిర్గతం కాకుండా ఇన్నాళ్లు దాచేశారు.@ysjagan ????????

pic.twitter.com/JdVBQ8lPfy

— vinayk1111 ???? (@vinayk1111) November 19, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు