ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏపీసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్) ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించింది. ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది.
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)-21ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.