అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

దేవీ

బుధవారం, 13 ఆగస్టు 2025 (18:40 IST)
Tribanadhari Barbaric Trailer poster
డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రల్ని పోషించారు.  ఆగస్ట్ 22న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు.
 
‘చూడు బార్బరికా.. ఈ యుద్దం నీది.. ధర్మ ధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసే వారికి దండన లభించాలి’..  ‘అనగనగా అందమైన తోట.. ఆ తోటలో తోటమాలి అందంగా పెంచుకుంటున్న ఓ గులాబి మొక్క.. నేను చెప్పిన ఆ కథలో తోటమాలి సామాన్యుడు అనుకుంటే పొరపాటే’.. అంటూ ట్రైలర్‌ను కట్ చేసిన తీరు, లవ్ స్టోరీ, తాత మనవరాలి ట్రాక్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్‌గా చూపించారు.
 
‘పాలల్లో నీళ్లే కలుపుత.. విషం కలుప’  అంటూ ఉదయభాను మీద పవర్ ఫుల్ సీన్లను చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. మిస్సింగ్ కేసు, మర్డర్ కేసు చుట్టూ ఈ ‘బార్బరిక్’  కథ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక విజువల్స్, మ్యూజిక్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌‌లో ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
 
ఇక ఇందులో సత్య రాజ్‌ని చూస్తుంటే ఓ యోధుడిలా, ఓ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఇక మోహన్ శ్రీ వత్స తన మేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ పురాణ కథకి, ప్రస్తుతం జరుగుతున్న సామాజిక సమస్యల్ని లింక్ చేస్తూ కథను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది.
 
ఈ కథలో సత్య రాజ్, సత్యం రాజేష్, వశిష్ట సింహ, ఉదయ భాను, సాంచీ రాయ్ ఇలా అందరూ అద్భుతమైన పాత్రలను పోషించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీని ఆగస్ట్ 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు