గణేష్ విగ్రహం ఎదుట డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:00 IST)
గణేష్ ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. విగ్రహం ఎదుట ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ అందరూ చూస్తుండగానే స్టేజిపైన పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా స్వీపర్స్ కాలనీలో గణేష్ మండపం వద్ద తన స్నేహితులతో కలిసి యువకుడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఉప్పెన చిత్రం పాటకు హుషారుగా డ్యాన్స్ చేస్తుండగానే కుప్పకూలిపోయాడు.
 
వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అతడు చనిపోవడానికి గుండెపోటు కారణమై వుండొచ్చని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు