దీపావళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా “క“ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - క సినిమాకు మేము ఎంతగా ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ టీమ్ అంతా అంతే ప్రమోషన్ చేసి ఆడియెన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యేలా చేస్తున్నారు. పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి క సినిమాను చేర్చారు. ఈటీవీ విన్ టీమ్ బాపినీడు గారు, సాయి కృష్ణ ఇతర అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క కావడం విశేషం. అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్ గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్ లో చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇంకా బాగా అనిపించింది అని చాలామంది చెబుతున్నారు. క సినిమా సక్సెస్ కు మా ప్రొడ్యూసర్ గోపి గారు, డైరెక్టర్స్ సందీప్, సుజీత్, డిస్ట్రిబ్యూటర్ వంశీ గారు..ఇలా ప్రతి ఒక్కరూ కారణం. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మంచి సినిమా చేస్తే ఆడియెన్స్ ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని క సినిమా ఇచ్చింది. అన్నారు.