గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్: పార్వతికి కూడా ముందస్తు బెయిల్

బుధవారం, 24 జనవరి 2018 (15:02 IST)
ప్రముఖ గజల్ కళాకారుడిగా గుర్తింపు సంపాదించిన గజల్ శ్రీనివాస్ చీకటి కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గజల్ శ్రీనివాస్ రాసలీలల వీడియోలు లీక్ కావడంతో కొత్త సంవత్సరం పుట్టిన రెండో రోజు (జనవరి 2) అతనిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. 
 
''సేవ్‌ టెంపుల్స్'' అనే గజల్ శ్రీనివాస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని ఆరోపణలతో చేయడంతో పాటు తగిన ఆధారాలతో కూడిన వీడియోలను పోలీసులకు అప్పగించింది. ఇంకా  పోలీసుల చేతుల్లోని గజల్‌ వీడియోలు కొన్ని లీక్‌ కావడం సంచలనంగా మారింది.
 
కాగా.. గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదే కేసులో ఏ2 నిందితురాలు పార్వతికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంతేగాకుండా రూ.10వేల నగదును ఇద్దరూ పూచీకత్తుగా చెల్లించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ కారణంగా త్వరలో గజల్ శ్రీనివాస్ విడుదల కానున్నాడు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు