పుట్టింది అమ్మాయే.. కానీ 17ఏళ్ల తర్వాత అబ్బాయని తేల్చిన వైద్యులు!

బుధవారం, 4 మార్చి 2015 (11:42 IST)
పుట్టింది అమ్మాయే.. కానీ 17ఏళ్ల తర్వాత అబ్బాయని వైద్యులు తేల్చారా.. ఎలా అనుకుంటున్నారా...? అయితే చదవండి. అమ్మాయని 17ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులకు ఒక్కసారిగా షాక్ తిన్నారు. 17 ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకున్న అమ్మాయి.. అబ్బాయి అని ఇప్పుడు వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ ఊరివారంతా అవాక్కయ్యారు.
 
వైద్య చరిత్రలో అత్యంత అరుదుగా జరిగే ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల పరిధిలోని బాగిర్తిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతుల కుమార్తె భవాని (17) పెరిగి పెద్దదైంది. మెదక్‌‌లో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను హైదరాబాదుకు తరలించగా, ఆమె అమ్మాయి కాదు, అబ్బాయని డాక్టర్లు నిర్ధారించారు. 
 
బాలుడిగా జన్మించిన అతని పురుషాంగం శరీరంలోనే ఉండిపోయిందని చెప్పి, శస్త్రచికిత్స చేసి పురుషాంగాన్ని బయటికి తీయడంతో, భవాని ఇప్పుడు భానుప్రసాద్‌‌గా మారాడు. మరో రెండు ఆపరేషన్లు చేస్తే భాను ప్రసాద్ పూర్తి పురుషుడిగా మారిపోతాడని వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా అమ్మాయి కాస్తా అబ్బాయిగా మారడంపై భాను తల్లి సంతోషం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి