అప్పట్లో బ్యారేజీ నీటిమట్టం 24.55 అడుగులకు చేరింది. జులై నెలలో చూస్తే.. అత్యధికంగా 1988 జులై 30న 17.50 అడుగులకు నీటి మట్టం చేరగా 21,22,310 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి వదిలారు.
ప్రస్తుతం ఆ స్థాయికి ఇన్ ఫ్లో దాదాపుగా చేరింది. గోదావరిలో చివరిసారిగా 2006 ఆగస్టు 7న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నీటి మట్టం 22.80 అడుగులకు చేరింది. అప్పట్లో 28,50,664 క్యూసెక్కుల వరద వచ్చింది.
శనివారం ఉదయానికి ఇది మరింత తీవ్రం కానుంది. కేంద్ర జలసంఘం, నీటిపారుదల శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గోదావరి చరిత్రలో రెండుసార్లు 70 అడుగుల మట్టం దాటగా, ఇది మూడోసారి.
కోనసీమ జిల్లాలో 256 హెక్టార్లలో వరి నారు, నాట్లు నీట మునిగాయి. 2,866 హెక్టార్లలో ఉద్యాన పంటలు మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2,302.10 హెక్టార్లలో వ్యవసాయ, 1,315.43 హెక్టార్ల ఉద్యాన పంటలు, పలుచోట్ల నర్సరీలు, పూలతోటలు ముంపునకు గురయ్యాయి. తూర్పుగోదావరి పరిధిలో 268.67 కి.మీ దారులు, కోనసీమ జిల్లాలో 247.72 కి.మీ పొడవున దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.