ముంపు వాసులను పునరావాస కేంద్రాలను తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.
అలాగే, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద కూడా వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు 36 గేట్లన ఎత్తివేసి ప్రాజెక్టులోకి వచ్చే నీటిని కిందికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 అడుగుల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,50,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.