తనపై, తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆమె.. తమపై పెట్టిన కేసుల గురించి ఆయనకు వివరించారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో.. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె వెంట తెదేపా నేతలు కేశినేని నాని, నిమ్మల రామానాయుడు, మద్దాల గిరి, వర్ల రామయ్య ఉన్నారు.
ఇసుక దోపిడీపై.. తెదేపా ఛార్జిషీట్
రాష్ట్రంలో ఇసుక దోపిడీపై తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్ విడుదల చేయనుంది. ఇసుక సమస్యకు వైకాపా నేతలు, మంత్రుల దోపిడీనే కారణమని ఆరోపించింది. వివిధ జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాలో నేతల ప్రమేయంపై తెదేపా ఛార్జిషీట్ రూపొందించింది.
రాష్ట్రంలో.... అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలుగుదేశం ఛార్జిషీట్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో 67 మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు, కీలక నాయకులు, వాటి కుటుంబ సభ్యులు ఇసుకదందాలు చేస్తున్నారని.. ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు.