ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక అభ్యుదయ నగర్‌లోని ఒయో లాడ్జిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు హోటల్‌కు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో మృతురాలి పేరు సంగీత అని, ఆమె వెస్ట్ బెంగాల్ వాసిగా గుర్తించారు. పైగా, ఈ మహిళ టెక్కీగా పని చేస్తున్నట్టు కనుగొన్నారు.
గత మూడు రోజులుగా వీళ్లిద్దరూ కలిసి ఒయో లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉన్నారనీ, మంగళవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ఆమెను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
దీంతో సీసీటీవీ ఫుటేజీలు, ఫేస్‌బుక్ చాటింగ్‌ల ద్వారా నిందితుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, సంగీత వయసు 48 సంవత్సరాల వరకు ఉండొచ్చని, లోకేశ్ వయసు 28 ఏళ్లని పోలీసులు వెల్లడించారు.