ఈ సర్వే ప్రకారం.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 సీట్లు దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 126 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పేర్కొంది.
ఇక మిగతా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభావం చూపనున్నాయంది. ఏపీలో జనసేన ప్రభావం బాగానే ఉన్నప్పటికీ.. సీట్లు గెలుపొందే విషయంలో మునుపటి పరిస్థితే ఉండొచ్చని అంచనా వేసింది.