Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

డీవీ

శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (22:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా విందు
 
ఓజీ చిత్రం నుండి ఊహించని సర్‌ప్రైజ్ 
 
పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన వాషి యో వాషి గీతం విడుదల
 
Pawan kalyan
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఒక పెద్ద సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన వాషి యో వాషి అనే ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ సర్‌ప్రైజ్‌తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. 
 
ఇప్పటికే వాషి యో వాషి అంటూ సామాజిక మాధ్యమాలు మారుమోగిపోతున్నాయి. విడుదలైన క్షణాల్లోనే శ్రోతల మన్ననలు పొందుతూ.. ఈ గీతం సంచలనాలు సృష్టిస్తోంది. అభిమానులు దీనిని మెగా విందు అని అభివర్ణిస్తున్నారు. అలాగే, ఈ మరపురాని సర్‌ప్రైజ్ అందించిన ఓజీ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు.
 
సంగీత మాంత్రికుడు తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఓజీ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన గీతాలన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన వాషి యో వాషి గీతం వాటిని మించేలా, మరింత శక్తివంతంగా ఉంది. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైలిష్ ఆరాకు సరిగ్గా సరిపోయేలా ఈ గీతముంది. 
 
థమన్ అద్భుతమైన స్వరకల్పన, పవన్ కళ్యాణ్ అద్భుతమైన గాత్రం కలిసి వాషి యో వాషిని మరుపురాని గీతంగా మలిచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఇది విందు భోజనంలా ఉంది. ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీనిని ప్రేక్షకులు, జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే గొప్ప విందుగా అభివర్ణిస్తున్నారు. 
 
ప్రతి బీట్ అభిమానుల హార్ట్ బీట్‌ని పెంచేలా ఉంది. సాహిత్యం కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఓజీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, వాషి యో వాషి గీతం ఆ అంచనాలను మరింత పెంచుతుంది. వాషి యో వాషి రాకతో సినిమా పట్ల అభిమానుల ఆసక్తి, ఉత్సాహం రెట్టింపు అయ్యాయి. 
 
నిజమైన బాక్సాఫీస్ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా వారు ఉన్నారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ఓజీ పేరు ఇప్పటికే మారుమోగిపోతోంది. 
 
సినీ వర్గాలతో పాటు, ట్రేడ్ పండితుల్లో సైతం.. ఈ చిత్రం గురించి తెగ చర్చ జరుగుతోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 
 
పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
 
తనని ఓజీ అని ఎందుకు పిలుస్తారో.. వాషి యో వాషి గీతంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. మరి కొద్ది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఓజీ రూపంలో పవర్ స్టార్ తుఫాను చూడబోతున్నాం. 
 
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్
దర్శకత్వం: సుజీత్ 
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస 
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు