ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబు, థాక్రేల మధ్య ఫోన్ సంభాషణ సుమారు అరగంట పాటు నడిచిందని సమాచారం.
ఈ సందర్భంగా బాబుతో ఉద్ధవ్ థాక్రే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో కటీఫ్ కావాలనుకుంటున్న బాబుకు ఉద్ధవ్ థాక్రే మాటలు మరింత బలాన్నిచ్చాయని సమాచారం. అంతేగాకుడా బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని శివసేన, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి 2019లో బీజేపీతో పోరాడుదామని చంద్రబాబుకు థాక్రే వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.