అమరావతి: భారతదేశానికి రెండో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ లోని ఉత్తర భాగంలో ఉన్న కరాచీ బేస్ ప్రాంతం భారతదేశంలోని అమృతసర్‌కు సరిహద్దు భూభాగం ఉంది. యుద్ధం తప్పదు అన్న సమయంలో ఆయుధాలు ప్రయోగించాల్సి వస్తే కరాచీ బేస్‌ను పాకిస్తాన్ ఎంచుకుంటుంది.
అమరావతికి శత్రు దేశాలకి లక్ష్యం చేధించలేనంత దూరం ఉండటం. దక్షిణ భారతంలో రక్షణ వ్యవస్థపరంగా అత్యంత అనువైన ప్రాంతంగా దాదాపుగా ఖరారైన అమరావతిలో డిఫెన్సుకు చెందిన హెడ్ క్వార్టర్స్ నిర్మించాలనే ఆలోచన కూడా ఉంది. అదే మార్గంలో ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌ని కూడా ఇక్కడే నిర్మించాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది.
ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌ని రెండో రాజధానిగా చెయ్యాలనే ప్రతిపాదన ఉంది. కానీ హైదరాబాద్ ఇప్పుడు మతవాదులు, తీవ్రవాదుల స్థావరంగా ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సున్నితంగా ప్రస్తావించింది. ఐతే అమరావతి ప్రాంతంలో ఉగ్రవాద ఛాయలు మచ్చుకైన లేకపోవడంతో కేంద్రం అమరావతిని రెండో రాజధానిగా చెయ్యాలనే ఆలోచనలో ఉంది.
అమరావతి దక్షిణాది రాష్ట్రాలలోనే ప్రధానమైనది. భావి అవసరాల దృష్ట్యా అమరావతి అత్యంత అనువైన ప్రాంతం అంతేగాక నదీపరివాహక ప్రాంతం కావటం ఇంకో విశేషంగా ప్రభుత్వం ప్రస్తావించింది. అనుకోకుండా వచ్చిన ఈ ప్రతిపాదన విషయంలో సిఎం చంద్రబాబు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. ఇంక ఈ ప్రతిపాదన రావడంతో ఎలాగైనా దీన్ని సాకారం చెయ్యాలని బాబు ధృడసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.