అనంతపురం జిల్లాలో చిరుత సంచారం...

బుధవారం, 2 డిశెంబరు 2020 (13:10 IST)
అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కాలనీ శివారులో చిరుత సంచరించడంతో ఆ గ్రామస్తులంతా భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామం ఎస్సీ కాలనీలో చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎస్సీ కాలనీ శివార్లలో వచ్చి కొండ పక్కనే పొదల్లో దాగి ఉందని గ్రామానికి చెందిన కొంతమంది యువకులు చెబుతున్నారు. 
 
చిరుత నుంచి తమకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. చిరుతను గ్రామంలోని పలువురు ప్రత్యక్షంగా చూడడంతో పాల వెంకటాపురం గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు