అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్ అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 13 ఆవులు, 6 మేకలు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి భీమన్న అనే గిరిజనుడుతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.