నాలుగేళ్లుగా అతడు ఆమె ఇంట్లోనే మకాం వేశాడు. కానీ ఉన్నట్టుండి ఊహించని రీతిలో అర్ధరాత్రి అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎండాకాలం కదా అని రాత్రిపూట నిద్రపోయేందుకు బయటే మంచంపై పడుకున్నాడు. అతడిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయిని అతడిపై వేశారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే అతడు మరణించాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం దిగువలభంవారిపల్లెకు ఆదిలక్ష్మి అనే మహిళకు పుంగనూరు మండలం అరడిగుంటకు చెందిన అర్జున్తో 15 ఏళ్ల క్రితమే పెళ్లయింది. పెళ్లయిన అయిదేళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయిదేళ్ల తర్వాత విబేధాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆదిలక్ష్మి తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది.
ఎండాకాలం కావడంతో శ్రీనివాసులు రోజూ రాత్రిళ్లు ఇంటి బయటే నిద్రించేవాడు. గురువారం రాత్రి కూడా అదే విధంగా ఇంటి బయట నిద్రపోయాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెద్ద బండరాయిని అతడిపై వేసి అక్కడినుంచి పరారయ్యాడు. గట్టిగా అతడు కేకలు వేయడంతో ఆదిలక్ష్మి బయటకు వచ్చి చూసింది. తీవ్రరక్తపు మడుగులో ఉన్న అతడిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.