ఆ ప్రాజెక్టుకు మేకపాటి గౌతం రెడ్డి పేరు ... సీఎం జగన్ వెల్లడి

మంగళవారం, 8 మార్చి 2022 (12:35 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమావేశాల తొలి రోజున గవర్నర్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. రెండో రోజైన మంగళవారం ఇటీవల హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి అసెంబ్లీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టులో సగ భాగానికి మంత్రి మేకపాటి గౌతం ప్రాజెక్టుగా నామరకణం చేస్తామని తెలిపారు. 
 
అలాగే, మరో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, గౌతం మరణం చాలా లోటని చెప్పారు. ఆయన మరణంపై మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదన్నారు. తన హక్కన సీటులో కూర్చోవాల్సిన వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. తనను గౌతం రెడ్డి అన్ని విషయాల్లో ప్రోత్సహించేవారనీ, తనకు అత్యంత సన్నిహితుడని, సొంత అన్నలా ఉండేవారని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సంతాప సందేశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గౌతం రెడ్డితో తమకున్న అనుబంధాన్ని వారు సభలో గుర్తుచేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు