గతంలో తను ఎన్నోసార్లు చెప్పానని అధికారుల దృష్టికి రోజా తీసుకెళ్ళారు. నగరం మధ్యలో ఉండటంతో త్వరగా ఈ పనులను పూర్తి చేసి స్థానికుల్లో భయాందోళన పోగొట్టుకోవాలని కోరారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ పైన కేసు కూడా పెట్టాలన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ తినేశాడంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.