వైకాపా రోజా చెంపలు పగులుతాయ్.. జాగ్రత్త: ఉష వార్నింగ్

గురువారం, 23 డిశెంబరు 2021 (12:49 IST)
వైకాపా ఎమ్మెల్యే, ఆర్కే రోజాపై తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ నటి, ఎమ్మెల్యే రోజా నోరు అదుపులో పెట్టుకోవాలనీ, లేదంటే చెంపలు పగులుతాయని హెచ్చరించారు. 
 
సీఎం జగన్‌ మెప్పు కోసం, మంత్రి పదవి దక్కించుకోవాలన్న ఆశతో ఇష్టారాజ్యంగా రోజా విమర్శలకు దిగితే తెలుగు మహిళలు ఊరుకోరన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు వరద ధాటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ఎక్కడున్నారని ప్రశ్నించారు.
 
రాజకీయాలకు అతీతంగా నారా భువనేశ్వరి వరద బాధితులకు సాయం అందించి ఆదుకున్నట్లు ఉష చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తనను అవమానించిన వారి గురించి ఆమె హుందాగా మీడియాకు సమాధానం చెప్పారన్నారు. ఎవరినీ నిందించలేదనీ, పేరు కూడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు