మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

సిహెచ్

శనివారం, 16 ఆగస్టు 2025 (14:36 IST)
79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి అనే అపోహను తొలగించి, దానిపై అవగాహన పెంచుకోవాలి. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.
 
మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ డెగ్లూర్కర్ మాట్లాడుతూ, క్యాన్సర్ నిర్ధారణలో ఆలస్యం చేయకూడదు. ఈ ఉచిత శిబిరం ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం. మేము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తమ చికిత్సను అందిస్తాము, ఈ శిబిరం ద్వారా ప్రజలకు సకాలంలో సహాయం అందించడం మా లక్ష్యం అని తెలిపారు.
 
మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ హెడ్ సువన్కర్ మాట్లాడుతూ, ప్రజల్లో క్యాన్సర్‌పై భయాన్ని తొలగించి, సమయానికి పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కల్పించడం మా లక్ష్యం అని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
 
శిబిరంలో ఉచితంగా అందించే పరీక్షలు:
మమ్మోగ్రఫీ (రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్)
పాప్‌స్మియర్ (సర్వికల్ క్యాన్సర్ పరీక్ష)
పీ.యూ.ఎస్ (పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్ష)
క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్
ఈ శిబిరం ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 040 6833 4455 నంబర్‌ను సంప్రదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు