అయితే, రోజురోజుకూ ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టినిసారించింది. వరుస మరణాలకు కారణాలు ఏంటో అన్వేషించే పనిలో నిమగ్నమైంది. జిల్లా వైద్యాధికారులతో పాటు పోలీసులు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తదితర విభాగాలు ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.