సంగం చెత్త సంపద కేంద్రంలో రాసలీలలు...

మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:45 IST)
నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో హసనాపురం - కలిగిరి రహదారిలో నిర్మించిన చెత్త సంపద కేంద్రం (డంపింగ్ యార్డ్) ఇపుడు రాసలీలకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు ఇక్కడ మందు బాబులతో పాటు ప్రేమికులు వాలిపోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చెత్త సేకరణ కోసం నిర్మించిన తొట్టెల్లో చెత్తకు బదులు కుప్పలు తెప్పలుగా నిరోధ్‌లు కనిపించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ రహదారిలో చెత్త సేకరణ కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయల వ్యయంతో ఈ కేంద్రాన్న నిర్మించింది. దీని కేంద్రం పూర్తయినా ప్రారంభించకపోవడంతో కొందరు దీన్ని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ చెత్త సంపద కేంద్రం గ్రామానికి దూరంగా రహదారికి పక్కనే ఉండటంతో విచ్చలవిడిగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. చీకటి పడితే మందుబాబులకు అడ్డాగా మారింది. 
 
గ్రామంలో పొడి, తడి చెత్తను సేకరించి సంపద సృష్టించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కల్పించేందుకు ప్రతి గ్రామంలో చెత్త సంపద కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మేజర్‌ పంచాయతీ సంగంలోని కలిగిరి రహదారిలో రూ.10 లక్షలతో డంపింగ్‌ యార్డ్‌ నిర్మించారు. రెండు నెలల క్రితం పూర్తయినా ప్రారంభించలేదు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు