హైదరాబాద్, బంజారా హిల్స్‌లో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్ నడుపుతూ వచ్చిన కారు టీఎస్07, ఎఫ్‌కే 7117 కారు ప్రమాదానికి గురైంది. మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో కారులోని నిషిత్‌తో పాటు.. అతన్ని స్నేహితుడు దుర్మరణంపాలయ్యారు. ఈ ప్రమాదానికి గురైన బెంజ్ కారు వేర్వేరు సందర్భాల్లో పరిమితికి మించి వేగంగా వెళ్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పీడ్‌గన్‌తో గుర్తించారు.
సరిగ్గా రెండు నెలలకు, అంటే ఈనెల 10వ తేదీ బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంతో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలోనూ కారు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఉండివుంటాడని, అందుకే నిషిత్, అతని స్నేహితుడు ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి నారాయణ లండన్‌లో ఉన్నారు. ఆయన ఈ వార్త విని కుప్పకూలిపోయారు. అయితే ఇండియాకి వచ్చిన నారాయణ కొడుకు మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని తనకు తెలియదని, తెలిసి ఉంటే వారించేవాడినని నారాయణ ఉద్వేగానికి లోనయ్యారు.