ముందుగా కౌన్సెలింగ్‌ ఇచ్చుంటే మేధావిని కోల్పోయే వాళ్లం కాదు: రోహిత్ సూసైడ్‌పై పవన్‌

శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:25 IST)
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పరిశోధక దళిత విద్యార్థి రోహిత్ వేముల మృతిపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. కాషాయికరణపై రోహిత్‌ వేముల తొందరపాటులో ఏదో అన్నందుకు క్యాంపస్‌ నుంచి బయటికి పంపించేశారని, అలా చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఒకవేళ కౌన్సెలింగ్‌ ఇచ్చివుంటే మేధావిని కోల్పోయే వాళ్లం కాదని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రోహిత్ ఆత్మహత్య గురించి శుక్రవారం మాట్లాడతానంటూ పవన్ గురువారం ఓ ట్వీట్ చేసిన విషయంతెల్సిందే. దీనిపై ఆయన శుక్రవారం స్పందించారు. రోహిత్‌ వేములకు బీజేపీ అంటే ఇష్టం లేదని, అంతమాత్రాన అతడిని వేధించే అధికారం బీజేపీకి లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివన్నారు. 
 
రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. రోహిత్‌ విషయంలో కేంద్రం జోక్యం సరికాదన్నారు. రోహిత్‌కు సొంత గ్రూప్‌ నుంచి కూడా నైతిక సహకారం అందలేదని, కొన్ని పార్టీలు మాత్రం రాజకీయలబ్ధి కోసం రోహిత్ వైపు మాట్లాడడానికి ప్రయత్నించాయని పవన్‌ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి