హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన సత్తెయ్య, ప్రమీలా దంపతుల కుమార్తె సంధ్యారాణి (27). మంగళగిరి ఎన్నారై మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2015లో పీజీ గైనకాలజీ విభాగంలో జీజీహెచ్‌లో సీటు పొందింది. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత మిర్యాలగూడలో శిశు వైద్య నిపుణుడైన డాక్టర్ రవిని పెళ్లి చేసుకుంది.
అయితే, చనిపోయే ముందు సంధ్యారాణి సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఇందులో ఓ మహిళా ప్రొఫెసర్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంది. దీంతో ఆ ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలంటూ సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.