తనకు నమస్కారం పెట్టొద్దని, దేవుడికి, తల్లిదండ్రులకు, గురువులకు మాత్రమే నమస్కారం చేయాలని సాయి దుర్గతేజ్ అభిమానులను కోరారు. అలాగే తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్లాలని ఆయన సూచించారు. తమ అభిమాన హీరో చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ కు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
"సంబరాల ఏటిగట్టు" చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్నారు. "సంబరాల ఏటిగట్టు" కార్నేజ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.