పేకాట శిబిరంపై పోలీసులు దాడి..10 మంది అరెస్టు

శనివారం, 18 జులై 2020 (20:48 IST)
కృష్ణా జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట సిఐ వి.సురేష్ బాబు, ఎస్సై టి రామకృష్ణ తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
ఈ దాడులలో పేకాట ఆడుతున్న పది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు లక్షల 57 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,
 
అదేవిధంగా ఒక కారు, ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తాం అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు