విలక్షణ నటుడు సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిద్రాహారాలు మాని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు 25,000 ఫేస్ షీల్డ్స్‌ను సదరు శాఖకు అందజేశారు.
ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పోలీసు సిబ్బందికి 25,000 ఫేస్ షీల్డ్స్‌ను అందించిన సోనూసుద్ సహకారానికి ధన్యవాదాలు అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
లాక్‌డౌన్ సమయంలో సోనూసూద్ వలస కార్మికులను బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ విమానాల్లో సొంతూళ్ళకు తరలించిన విషయం తెలిసిందే.