తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఆయన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అంతటితో ఆగక ఏకకాలంలో టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. తమ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. కొందరు కార్యాలయ సిబ్బందిపై కూడా దాడి చేసి, వారిని కర్రలతో కొట్టారని వివరించారు. కొన్ని కార్లు కూడా ధ్వంసం చేశారని, సుత్తులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో వచ్చారని పేర్కొన్నారు.
అయితే, పట్టాభి అనుచిత వ్యాఖ్యల వల్లే ఇదంతా జరిగిందని, పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు పంపారు. దీనిపైన, పట్టాభిని అరెస్టు చేసిన వైనంపై ఆగ్రహం చెందిన చంద్రబాబు 36 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఇదే సంయంలో వైసీసీ నేతలు పోటీగా జనాగ్రహం పేరిట నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అటు పట్టాభి తిట్డాడని, ఇరు వైపులా నాయకులు ఇష్టానుసారం ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. పట్టాభిని పందితో పోల్చారు వైసీపీ నాయకులు. అంతటితో చాలక, కొందరు ఇలా వినూత్న ప్రదర్శనలు కూడా చేశారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలో పందితో వినూత్న నిరసన తెలుపుతూ, ఇది పట్టాభి అని, దీనికి సిగ్గులేదంటూ, వైసీపీ నాయకులు. కార్యకర్తలు ఎద్దేవా చేశారు.