దేశంలో సంక్షోభం దిశగా విద్యుత్ ప్లాంట్లు : మోదీకి జగన్‌ లేఖ

శనివారం, 9 అక్టోబరు 2021 (08:49 IST)
విద్యుత్ సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. తక్షణం దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధానిని సీఎం కోరారు.

ప్రస్తుతం ఏపీలో 185-190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందనని తెలిపారు. కొవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం పెరిగిందని లేఖలో వివరించారు.

ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 1-2 రోజులు సరిపడ బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్టు జగన్ తెలిపారు. బొగ్గు కొరత కారణంగా బహిరంగ మార్కెట్ లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.

బొగ్గు కొరత వల్ల దేశంలోని విద్యుత్ ప్లాంట్లు సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదముందని లేఖలో జగన్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు