తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులపై ఆ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు తమ సొంత ప్రణాళికలతో పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, ఆలయ అధికారులు ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.
వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి దారుణ పరిస్థితిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తామని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా, రమణ దీక్షితులు గతంలో కూడా తితిదే వ్యవస్థ, అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.