శ్రీకాకుళంలో చేపల వర్షం.. ఆకాశం నుంచి రాలిన చేపలు.. (video)

శుక్రవారం, 21 జులై 2023 (09:51 IST)
Fish Rain
ఏపీ శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గురువారం వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కోనేరు, భూబాల పల్లి, కాళేశ్వరి నగర్, సుల్తానాబాద్ శాస్త్రి నగర్, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. దీంతో చేపలు రోడ్లన్నీ పాకాయి. ఆకాశం నుంచి చేపల వర్షం కురవడంతో ఆ ప్రాంత జనం ఆశ్చర్యపోయారు. 
 
దీన్ని గమనించిన మహిళలు రోడ్డుపై పడిన చేపలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అదేవిధంగా వజ్రపు కోనేరు గ్రామంలోని ఆంజనేయ ఆలయ సముదాయంలో పెద్దఎత్తున చేపలు పడ్డాయి. నేలపై పడిన చేపలను సేకరించేందుకు గ్రామస్తులు, భక్తులు పరుగులు తీశారు.
 
శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి వర్షంతో ఆకాశం నుంచి చేపలు రాలినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకాశం నుంచి పడిన చేపలు నలుపు రంగులో చూడ్డానికి భయంకరంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీకాకుళంలో చేపల వాన

శ్రీకాకుళం - వజ్రపుకొత్తూరు మండలం వజ్రపు కోనేరు గ్రామంలో చేపల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షంతో పాటు చేపలు కిందపడ్డాయి. గ్రామంలో పలు చోట్ల చేపలు వర్షంతో పాటు చేపలు ప్రత్యక్షమయ్యాయి. pic.twitter.com/KyikpZawRf

— Telugu Scribe (@TeluguScribe) July 20, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు